Showing posts with label GROUP-2. Show all posts
Showing posts with label GROUP-2. Show all posts

Tuesday, November 10, 2020

 సమాజం 

 Hi friends! Are you searching for  Satavahanas their rule of the system of socialism PART-2(శాతవాహనలు వారి  పరిపాలన విధానం సామజిక స్యరూపం).After Reading  Please do share it with your friends. Learn More GK Topics


 సమాజం 

→ అప్పట్లో చతుర్ వర్ణ వ్యవస్థ ఉండేది . కానీ సాధారణ ప్రజలు బౌద్ధమతాన్ని స్వీకరించుట కారణంగా వర్ణ వ్యవస్థ సమాజంపై పెద్దగా ప్రభావాన్ని చూపలేదు .
• 
బ్రాహ్మణులకు అత్యున్నత స్థానం కల్పించబడింది .

• విదేశీ తెగ వారైన ' శకులు శాతవాహన సమాజంలో కలవడాన్ని గౌతమిపుత్ర శాతకర్ణి అడ్డుకున్నాడు . అందువలన గౌతమిపుత్ర శాతకర్ణి కు ' వర్ణ సంకర్యనిరోధక ' అను బిరుదు ఇవ్వబడింది . అప్పట్లో ఉమ్మడి కుటుంబ వ్యవస్థ ఉండేది

• 'ధిమిక ' అనే చర్మకారుడు తన కుటుంబ సమేతంగా అమరావతి స్థూపాన్ని సందర్శించి పూర్ణ కుంభమును సమర్పించాడు . కుల పెద్దలను గుహపతులనేవారు 
• 
నాగానిక , గౌతమీ బాలశ్రీలు పరిపాలనలో పాల్గొన్నారు . అప్పట్లో అనేక మంది మహిళా కవియిత్రులు ఉండేవారు

ఉదా : రేవతి , మాధవి , అనులక్ష్మీ
స్త్రీలు తమ భర్తలతో యజ్ఞయాగాదులలో పాల్గొనేవారు  మహిళలకు మత స్వేచ్ఛ కల్పించడింది . .భర్తల బిరుదులు పొందేవారు .
ఉదా : మహాభోజకివీరికి ఆస్తిహక్కు కూడా కల్పించబడింది .

• గౌతమీ బాలశ్రీ ' భద్రయాన కొండ పై బౌద్ధ విహార నిర్మాణానికి విరాళం ఇచ్చింది .

 హాలుడు తన గాధా సప్తసతిలో మహిళల గురించి వ్యతిరేకగా పేర్కొన్నాడు.

• ఉట్లేషం ( తలపాగ ) ను ధరించేవారు

•  కుసుమవన్నె ( బెంగాళీ చీరలు ) అంటే స్త్రీలకు మోజు ఎక్కువ
•  
జంట నాట్యాలు , బృంద నాట్యాలు వీరి ప్రధాన వినోదాలు .
• 
అధికారులు జూదమాడేవారు .
• 
అప్పట్లో పితృస్వామ్య సమాజం ఉండేది

• రాజరికం కూడా పితృస్వామికమే ఉండేది .
ఆర్థిక వ్యవస్థ
 • 
రాజ్యానికి ప్రధాన ఆదాయం - భూమిశిస్తు అందువల్లనే శాతవాహనులు వ్యవసాయ అభివృద్ధికి . కృషి చేశారు
• 
ఆధునిక వ్యవసాయ పనిముట్లు తయారు చేయుటకు ఒక సాంకేతిక నిపుణుల సంఘాన్ని ఏర్పాటు చేశారు . దీనిని ఓదయంత్రిక ' అంటారు .
• 
ఓదయంత్రిక  క్రింది పనిముట్లను రూపొందించింది .
1. 
ఉదక యంత్రంభూమిని దున్నేయంత్రం
2. 
ఘటియంత్రంనీటిని పైకి లాగడానికి
3. 
ఘటిక యంత్రం  :ముడి పత్తి నుండి విత్తనాలు వేరు చేయు యంత్రం

• రజ్జగాహకుడు భూమి శిస్తును నిర్ణయించి  శిస్తును వసూలు చేసేవాడు . భూమి శిస్తును భాగ లేదా దేయమేయ అనేవారు .

• ఇది సాధారణంగా 1/6  వంతు ఉండేది . చేతివృత్తుల వారి పై విధించే పన్నును కురుకర ' అనేవారు . అప్పట్లో 18 వృత్తి శ్రేణి వారు లేదా అష్టదశ వర్ణాలవారు ఉండేవారు . ఉదా :

→ హాలక : పొలం దున్నే వాడు / వ్యవసాయదారుడు .

 కొలికనేతపనివాడు

→ కులరికకుమ్మరివాడు :

→ ఇనుము పనివాడు :

గంధిక : నుగంధ పరిమళాలు తయారి చేసేవాడు

→ VEJA వైద్యుడు

→ వస్సాకర : వెదురు పనివాడు .

→ శిలవధికశిలలు చెక్కేవాడు

→ తిలపిశక : నూనే తీసేవాడు

→ మెరుగు పెట్టేవాడు

→ మణికార : రత్నాలు,మణులు పొదిగి నగలు తయారు చేసేవాడు

→ మాలాకార : మాలలు కట్టి విక్రయించేవాడు

 → వధిక : వడ్రంగి

Also Check

Satavahanas their rule of the system of socialism part-1

List Of Fist Person In India( భారత్ లో మొదటి వ్యక్తులు)

Important dates,Highlights ( తేదీలు - ప్రాముఖ్యతలు)

→ అప్పట్లో విదేశీ వర్తకం బాగా అభివృద్ధి చెందింది . రోమ్ దేశంతో వర్తకం జరిగేది . ' రోమ్ దేశం యొక్క బంగారం అంతా భారతదేశానికి తరలిపోతుందని " ప్లీని పేర్కొన్నాడు .

→ విదేశీ వర్తకం లేదా సుదూర ప్రయాణాలు చేసి వర్తకం వారిని సార్ధవాహకులు అంటారు . స్వదేశీ వర్తకం కూడా బాగా అభివృద్ధి చెందింది

 స్వదేశీ వర్తకులు సంఘాలుగా ఏర్పడేవారు .  సంఘాలనే నిభయ లేదా నికాయ లేదా నిగమ అనేవారు  సంఘాలు నిర్వహించే సమావేశాన్ని గోష్టి అనేవారు

 → గోష్టి అధ్యక్షుడు - శెట్టి

→ శాతవాహనుల కాలంలో అత్యధికంగా సీసనాణెలు ముద్రించబడ్డాయి

 • పొటీన్ అనే మిశ్రమ లోహనాణేలు కూడా ముద్రించారు .

• బంగారు నాణేలు సువర్ణాలు • వెండి నాణేలు - కర్షపణాలు

• ఒక బంగారు నాణెం →  35 వెండి నాణేలతో సమానం .

→ అప్పట్లో వడ్డీ వ్యాపారం బాగా అభివృద్ధి చెందింది . వడ్డీ వ్యాపారస్తులు 12% వడ్డీను వసూలు చేసేవారు→ అప్పట్లో శాతవాహనుల అతిముఖ్యమైన ఓడరేవు - బారుకచ / బ్రోచ్ ( గుజరాత్ ) తూర్పు తీరంలో అతి ముఖ్యమైన ఓడరేవు మోటుపల్లి

 • శాతవాహనుల కాలంలో వైదిక , జైన , బౌద్ధ మతాలు వ్యాప్తి చెందాయి . 

వైదిక మతం :

• శాతవాహన రాజులు వైదిక మతాన్ని పాటించగా రాణులు బౌద్ధమతాన్ని ఆదరించేవారు .

• ఒకటో శాతకర్ణి , రెండో శాతకర్ణి , GPS , యజ్ఞశ్రీ శాతకర్ణిలు అనేక యజ్ఞయాగాదులను నిర్వహించారు .

• నాగానిక యొక్క నానాఘడ్ శాసనంలో అనేక మంది వైదిక దేవుళ్ళ గురించి పేర్కొనబడింది . ఉదా : ఇంద్రుడు , అగ్ని , వరుణుడు , కుబేరుడు .

• శాతవాహన రాజు కనుడు కాలంలో భాగావత మతం దక్షిణ భారతదేశంలోకి ప్రవేశించింది .

 హాలుడు తన గాధాసప్తశతిలో అనేక విష్ణు కథలు పేర్కొన్నాడు .

• గాధాసప్తశతి పుస్తకం శివుని ప్రార్ధనతో ప్రారంభమై పార్వతి ప్రార్ధనతో అంతం అవుతుంది .

 A.P. లో అతి ప్రాచీన శివలింగం - చిత్తూరు జిల్లాలోని గుడిమల్లం ఇది శాతవాహనుల కాలం నాటిది . ఇష్టదైవాలను , పురాణ పురుషులను పూజించే పౌరాణిక మతం వీరికాలంలోనే ప్రారంభమయింది .

 జైనమతం : 

శాతవాహన రాజ్యస్థాపకుడైన శ్రీముఖుడు మొదట్లో ఒక జైనమతాభిమాని

• అశోకుడి మనవుడు సంపాతి ( జైన అశోకుడు ) వడ్డయాన కొండ పై జైన బసది నిర్మించాడు .

•A.P. లో మొట్టమొదట జైనాచార్యుడు - కొండకుందా చార్యుడు . ఇతను సమయసారం అనే గ్రంథాన్ని రచించాడు .

బౌద్ధమతం :

 రాణులు , వర్తకులు , సాధారణ ప్రజలు బౌద్ధమతాన్ని పాటించారు . వర్తకులు బౌద్ధమతాన్ని పాటించుటచే ఇది అత్యంత ధనిక మతంగా మారింది .A.P. లో మొట్టమొదటి బౌద్ధాచార్యుడుమహాదేవ భిక్షువు ఇతను బుద్దుని జీవిత ఘట్టాలకు సంబంధించిన చిహ్నాలను పూజించే ' చైత్యక వాదం ' అనే సంప్రదాయంను ప్రవేశపెట్టాడు .

• A.P. లో అతి ప్రాచీన చైత్యం - గుంటుపల్లి

• ఇది పశ్చిమగోదావరి జిల్లాలోని జీలకర్రగూడెంలో ఉంది
• 
గుంటుపల్లి చైత్యంను మౌర్యుల కాలంనాటి బరాబరా గుహల'తో పోల్చుతారు • ఆరామం : స్థూపం , విహారం , చైత్యం , విద్యాలయం ఒకే చోట ఉంటే  ప్రాంతాన్ని ఆరామం అంటారు
• 
ఉదాహరణకు కడపలోని నందలూరు చిత్రలేఖనం :
•  
శాతవాహనుల కాలంలో చిత్రలేఖనం కూడా అభివృద్ధి చెందింది . అజంతా గుహలలో 9 , 10 గుహలలోని చిత్రలేఖనం శాతవాహనులకు చెందినది .

• జాతక కథలలోని బుద్ధుని జీవిత చట్టాలను చిత్రలేఖనంగా చెక్కారు
 శాతవాహనులు అధికార భాష - ప్రాకృతం

 ప్రాకృతం సామాన్యుల భాష 

  కాలం ప్రాకృతానికి స్వర్ణయుగం , 

 ఆంధ్ర ప్రాకృతాన్నే పైశాచిక ప్రాకృతం అంటారు .

 సంస్కృతంలో గ్రంథాలను శర్వవర్మ , ఆచార్య నాగార్జునుడు మాత్రమే  కాలంలో వ్రాశాడు .

తెలుగు భాష :

 D.C. సర్కార్ ప్రకారం  కాలంలో ప్రస్తావించబద్ద దేశీ బాషే తెలుగు అని పేర్కొన్నాడు 

• శాతవాహనుల కాలంలోనే తెలుగు భాష ఆవిర్భవించింది .
•  
తెలుగులో మొట్ట మొదటి వదం ' నాగబు ' అమరావతిలోని ఒక శాసనంలో ఉంది .
• 
హాలుని గాధా సప్తశతిలో 40 కు పైగా తెలుగు పదాలు ఉన్నాయి . ఉదా : అందంఅత్త ,పొట్ట ,అద్దం .

   కార్తికేయ శర్మగారు  పదాలు తెలుగు పదాలు అని పేర్కొన్నాడు .

 పులోమావి అనగా గడ్డిలో జన్మించినవాడు . ఇది తెలుగు పదం .

 బౌద్ధ మతం కారణంగానే శాతవాహనుల వాస్తు అభివృద్ధి చెందింది . 

 - బౌద్ధమత నిర్మాణాల్లో ప్రధానమైనవి . 

 స్తూపం : -

  స్థూపం అనగా బుద్ధుడు కాని అతని శిష్యుల ధాతువులపై అర్ధ చంద్రాకారంలో నిర్మించిన నిర్మ పశ్చిమ గోదావరి ) , సంగారం ( విశాఖ ) ఉద్దేశిక స్థూపాలు .

  అలెగ్జాండర్ రే సంగారంలో త్రవ్వకాలు నిర్వహించాడు . 

  ఇక్కడ సముద్ర గుప్తుడి నాణాలు ధ్యానబుద్ధ , హారతిబుద్ధ విగ్రహాలు దొరికాయి .

 చైత్యగృహం : - 

→  పూజా వస్తువుగా స్థూపంగాని,బౌద్ధ విగ్రహం గాని వుంటే దానిని చైత్యగృహం అంటారు .

→ ఆంధ్రప్రదేశ్ లో అతి ప్రాచీన చైత్యం - గంటుపల్లి ( పశ్చిమ గోదావరి ) 

అమక స్థంభాలు : - బుద్దుని జీవితంలోని ఐదు గుర్తులకు చిహ్నంగా 5 స్థంభాలు నిర్మించారు . 

జననం తామర 

మహాభినిష్క్రమణం గుర్రం

సంబోధి ( జ్ఞానోదయం ) రావిచెట్టు

తొలి ధర్మబోద చక్రం

మదణం స్థూపం 

విహారం : - 

  వర్షాకాలంలో బౌద్ధ బిక్షువులు నివాసం కోసం ఉపయోగించేవి విహారాలు . 

→  ఇవి చతురస్రాకారంలో వుంటాయి . 

ఆరామం : -

 స్థూపం , చైత్యం , విహారం , విద్యాలయం , అయక స్థంభాలు ఒకచోట వుంటే దానిని ఆరామం అంటారు రామతీర్థం విహార సంగారామాన్ని అలెగ్జాండర్ 1908-09లో కనుగొన్నాడు . 

  ఆంధ్రలో 40 విహారాలు వున్నాయి అని హుయాన్త్సాంగ్ పేర్కొన్నాడు . 

 అమరావతి స్థూపం :

 ఇది గుంటూరు జిల్లాలో వుంది . ' అమరావతికి  పేరు పెట్టింది వాసిరెడ్డి వెంకటాద్రి నాయుడు . 

 దీనిని ధాన్యకటకం , ఆంధ్రనగరి , పూర్వ శైలము,ధరణికోట,శ్రీస్థాన ,వజ్రపర్వతం మొ || పేర్లుతో పిలుస్తారు . 

 అమరావతి స్థూపం 142 అడుగులు ఎత్తు , 162 అడుగుల వ్యాసంతో వుంది . 

 1797 లో కల్నల్ క్యాలిన్ మెకంజి దీనిని కనుగొన్నాడు . 

 మహదేవ భిక్షు నలుడు లేదా నాగ అశోకుడి సహాయంతో నిర్మించాడు . అతడు అశోకుడి ధర్మమహామాత్రుడు అని కొందరి చరిత్రకారుల అభిప్రాయం . 

 దీనిని వశిష్టపుత్ర రెండోపులోమావి నిర్మించాడు . దీనికి పూర్ణకుంభాన్ని దిమీక అనే చర్మకారుడు సమర్పించాడు .

 ఆచార్య నాగార్జునుడు దాన్యకటక మహాచైత్యానికి శిలాప్రాకారం నిర్మించాడు .

 అమరావతి తొలి దశ సాంచి శైలిలోను రెండో దశ గాంధార శైలిలోను వుంటుంది ,

  శైలికి అమరావతి శైలి అని జాన్ మార్షల్ పేరు పెట్టాడు . 

 అమరావతి శైలి భారత శిల్పకళకే పరాకాష్ట అని ఫర్గుసన్ పేర్కొన్నాడు . 

  స్థూపంపై నలగిరి దమన,ఆనంద పిందక జాతక కథలు చెక్కబడ్డాయి .

 మంజుశ్రీ ములకల్ప ప్రకారం బుద్ధుని అవశేషాలు ఇక్కడ వున్నాయి . 

 నాగార్జున కొండ :

1926 లో A.R. సరస్వతి ఇక్కడ త్రవ్వకాలు నిర్వహించాడు  ఇక్కడ ప్రాచీన , మధ్య , నవీన శిలాయుగ అవశేషాలు లభ్యమయ్యాయి . 

 దీనిని బహు సంస్కృతుల ప్రాంతం అంటారు . 

 చిత్రలేఖనం : -

  మహారాష్ట్రలోని ఔరంగాబాద్ లో అజంతా గుహలలో 8 , 9 , 10 , 12 , 13 నెంబర్ల గుహలలో చిత్రలేఖనాలు శాతవాహనుల కాలానికి చెందినవి . 

 9  గుహలో నల్లయువరాణుల చిత్రాలు వున్నాయి , 

 10  గుహలో శ్వేతగజజాతక చిత్రం వుంది 

 

 

  

 

Topics

Popular Posts

Recent Posts